Avanthi Srinivas: డాక్టర్ సుధాకర్ పై చర్యలు తీసుకోవడానికి కారణం ఇదే: మంత్రి అవంతి

Doctor Sudhakar hadnt performed his duties well says Minister Avanthi
  • విధులను డాక్టర్ సక్రమంగా నిర్వహించలేదు
  • ఈ అంశాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు
  • ఎలాంటి దెబ్బనైనా ఎదుర్కోగల శక్తి జగన్ కు ఉంది
వైజాగ్ కు చెందిన డాక్టర్ సుధాకర్ పై వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విధులను సక్రమంగా నిర్వహించనందువల్లే ఆయనపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. డాక్టర్ అంశాన్ని టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులన్నింటినీ ముఖ్యమంత్రి జగన్ ఏడాది కాలంలోనే పూర్తి చేశారని అన్నారు. కరోనా సమయంలో సైతం సంక్షేమ పథకాలతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలను అమలు చేశారని చెప్పారు.

నాయకుడికి కావాల్సింది అనుభవం, వయసు కాదని... జగన్ లాంటి పెద్ద మనసు అని అవంతి అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎలాంటి దెబ్బనైనా ఎదుర్కోగల శక్తి జగన్ కు ఉందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని... బషీర్ బాగ్ ఘటనను జనాలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.
Avanthi Srinivas
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News