TTD: తిరుమల శ్రీవారి విలువైన భూముల విక్రయానికి టీటీడీ నిర్ణయం... కమిటీల ఏర్పాటు!

  • ఆస్తుల విక్రయాలకు ఎనిమిది మందితో రెండు కమిటీలు 
  • తమిళనాడులో 23 చోట్ల ఉన్న ఆస్తుల అమ్మకం
  • బహిరంగ విక్రయానికి నిర్ణయం
TTD all set to sell Srivari lands in TN

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారికి చెందిన కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మేందుకు టీటీడీ అడుగులు వేస్తోంది. తమిళనాడులో 23 చోట్ల ఉన్న ఆస్తులను  విక్రయించాలని నిర్ణయించింది.

దీనికి సంబంధించి ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసినట్టు వెల్లడైంది. ఆస్తుల విక్రయానికి టీటీడీ రెండు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆస్తులను బహిరంగంగా విక్రయించాలని నిర్ణయించింది. ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది.

More Telugu News