రానా, నాని మధ్య 'రోకా ఫంక్షన్'పై ఆసక్తికర సంభాషణ!
- వేడుక ఫొటోలు పోస్టు చేసిన రానా
- నిశ్చితార్థం జరిగిందా అంటూ ఆరా తీసిన నాని
- రోకా ఫంక్షన్ జరిగిందంటూ రానా రిప్లయ్
- రోకా ఫంక్షన్ అంటే తనకు తెలియదన్న నాని
అయితే రోకా ఫంక్షన్ అంటే ఏమిటో తనకు తెలియడంలేదని, అందుకే గూగుల్ లో వెతుకుతానని నాని సరదాగా రిప్లయ్ ఇచ్చాడు. అనంతరం ఈ చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను రానా పంచుకున్నాడు. పెళ్లి పనులు అధికారికంగా ప్రారంభమయ్యే ముందు వధూవరులు ఇళ్లల్లో జరిగే కార్యక్రమమే రోకా ఫంక్షన్ అంటారు. ఉత్తరాదిలో ఇది ఎంతో ప్రాముఖ్యత ఉన్న వేడుక.