Bengaluru: బెంగళూరులో అంతుచిక్కని భారీ శబ్దాలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు!

People scared with unknown sounds in Bengaluru
  • భారీ శబ్దాల భయంతో పరుగులు తీసిన జనాలు
  • భూకంపం కాదన్న కర్ణాటక డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్
  • విమాన శబ్దం కాదని చెప్పిన హెచ్ఏఎల్
లాక్ డౌన్ నిబంధనలు సడలింపులతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెంగళూరు వాసులను విచిత్రమైన భారీ శబ్దాలు బెంబేలెత్తించాయి. శబ్దాలకు జనాలు షాక్ అయ్యారు. భూకంపం వచ్చిందేమోనని కొందరు పరుగులు తీశారు. అయితే అది భూ ప్రకంపనల వల్ల వచ్చిన శబ్దం కాదని తేలింది. మరోవైపు, అది విమాన శబ్దం కూడా కాదు. మరి, ఇది దేని శబ్దం అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.  

దీనిపై కర్ణాటక స్టేట్ నేచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భూకంపానికి సంబంధించిన తనిఖీలు చేశామని... కానీ, భూకంపానికి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ రికార్డ్ కాలేదని చెప్పారు. మరోవైపు ఇది ఫైటర్ జెట్ వల్ల వచ్చిన శబ్దం కాదని హెచ్ఏఎల్ తెలిపింది. ఈ నేపథ్యంలో, శబ్దం ఏమిటనే దానిపై బెంగళూరు వాసులు భయాందోళన చెందుతున్నారు.
Bengaluru
Unknown Sounds

More Telugu News