Vishnu Kumar Raju: ఈ రేంజ్ లో షాకులిస్తున్న సీఎం ఒక్క జగన్ మాత్రమే: విష్ణుకుమార్ రాజు

No other CM is giving shocks like Jagan says Vishnu Kumar Raju
  • మద్యం ధరలు పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చారు
  • కరెంట్ బిల్లులు పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చారు
  • అన్నా క్యాంటీన్లు మూసి జనాలకు షాక్ ఇచ్చారు
ముఖ్యమంత్రి జగన్ భారీ షాకులు ఇస్తున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. మద్యం ధరలను భారీ ఎత్తున పెంచి మందుబాబులకు షాక్ ఇచ్చారని చెప్పారు. సామాన్యులకు కరెంట్ షాక్ ఇచ్చారని అన్నారు. 500 యూనిట్లు దాటిన తర్వాత 90 పైసల రేటు పెంచిన ఘనత కూడా జగన్ దేనని విమర్శించారు. ఆటో కార్మికులకు రూ. 10 వేలు ఇచ్చి... ఆ తర్వాత పోలీసులతో వారిపై కేసులు పెట్టించి, ఫైన్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

రూ. 5కి భోజనాన్ని అందించిన అన్నా క్యాంటీన్లను మూసేసి పేదవారికి షాక్ ఇచ్చారని అన్నారు. కరోనా సమయంలో అన్నా క్యాంటీన్లు ఉంటే ఉపయోగకరంగా ఉండేదని చెప్పారు. అన్నా క్యాంటీన్ల పేరును జగనన్న క్యాంటీన్లుగా మార్చి కొనసాగించినా బాగుందేదని అన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి షాకులు తగిలాయని చెప్పారు. దేశంలో ఇంత పెద్ద ఎత్తున షాకులిచ్చే ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని అన్నారు.
Vishnu Kumar Raju
BJP
Jagan
YSRCP

More Telugu News