Schools: ఏపీలో స్కూళ్లు ఆగస్టు 3న ప్రారంభం

Schools in AP starts in August first week
  • కరోనా వ్యాప్తితో మార్చి నెలాఖరు నుంచి మూతపడిన విద్యాసంస్థలు
  • తాజాగా వేసవి సెలవులు మరింత పొడిగించిన ఏపీ సర్కారు
  • ఆగస్టు నుంచి తగిన జాగ్రత్తలతో స్కూళ్లు నడపాలని సీఎం ఆదేశం
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండడంతో మార్చి నెలాఖరు నుంచే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఏపీలోనూ పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంపై దృష్టి సారించింది. ఆగస్టు 3న రాష్ట్రంలోని పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందని రీతిలో తగిన జాగ్రత్తలతో స్కూళ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. స్కూళ్ల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని జగన్ తెలిపారు.

కాగా, ప్రతి స్కూల్లో 9 రకాల సదుపాయాలు కచ్చితంగా కల్పించాలని, అందుకోసం రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను కూడా విడుదల చేశామని చెప్పారు. స్కూళ్లకు సెలవులు పొడిగించినందున ఈ విరామంలో సదుపాయాల కల్పన చేయాలని, జూలై 30 నాటికి స్కూళ్లన్నీ పూర్తి ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
Schools
Andhra Pradesh
Start
August
Lockdown
Corona Virus

More Telugu News