Junior NTR: ఆ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్!

NTR spares one year callsheets to Prashanth
  • 'కేజీఎఫ్'తో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ 
  • 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్ సినిమాల తర్వాత ఇదే 
  • ఏడాది పాటు డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్     
'కేజీఎఫ్' కన్నడ సినిమాతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ప్రస్తుతం ప్రశాంత్ రెడీ చేస్తున్నాడు. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, హిందీ భాషాల్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ 'కేజీఎఫ్'కి సీక్వెల్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా వున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజక్ట్ ఇప్పటికే సెట్ అయింది. సో.. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ చిత్రం చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడట.

ఇక ఈ సినిమా విస్తృతిని బట్టి దీనికి ఏడాది పాటు డేట్స్ కేటాయించడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. చిత్రాన్ని ఎక్కడా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా చేద్దామని ఎన్టీఆర్ దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. రేపు ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి, ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
Junior NTR
Prashanth Neel
KGF
RRR

More Telugu News