Rashmi Gautam: సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన రష్మి వ్యాఖ్యలు!

Rashmi comments on Surrogacy shakes internet
  • అద్దె గర్భంపై విమర్శలు గుప్పించిన రష్మి
  • అనాధ పిల్లలను దత్తత తీసుకోవచ్చు కదా అని వ్యాఖ్య
  • సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా? అని మండిపాటు
సరోగసీ (అద్దె గర్భం)పై సినీ నటి, యాంకర్ రష్మి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనే బదులు... అనాధ పిల్లలను దత్తత తీసుకోవచ్చు కదా? అని రష్మి వ్యాఖ్యానించింది.

సొంత రక్తం అయితేనే ప్రేమిస్తారా? అని ప్రశ్నించింది. ఇది ముమ్మాటికీ వివక్షను చూపించడమే అవుతుందని చెప్పింది. కులాభిమానం, మతాభిమానం వంటిదే ఇది కూడా అని విమర్శించింది. పిల్లల విషయంలో జీన్స్ కొంత వరకే ఉపయోగపడతాయని... మిగిలిందంతా తల్లిదండ్రుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పింది. రష్మి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుంటే... మరి కొందరు విమర్శిస్తున్నారు.
Rashmi Gautam
Tollywood
Surrogacy

More Telugu News