Jr NTR: ఎంతో శ్రమించినా వీలు కాలేదు: అభిమానులకు ఎన్టీఆర్ లేఖ

Jr NTR writes for his fans who disappointed with no teaser on his birth day
  • ఎల్లుండి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు
  • టీజర్ రిలీజ్ చేయడంలేదన్న ఆర్ఆర్ఆర్ యూనిట్
  • నిరాశకు గురైన అభిమానులు
  • అభిమానులకు సందేశాన్నిచ్చిన ఎన్టీఆర్
మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ఓ సర్ ప్రైజ్ వీడియో రిలీజ్ చేస్తుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. వీడియో రూపొందించడం వీలుకాలేదని, ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి టీజర్ రిలీజ్ చేయడం లేదని ఆర్ఆర్ఆర్ యూనిట్ ప్రకటించడం అభిమానులను అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఎన్టీఆర్ లేఖ రూపంలో స్పందించారు.

"మీ ఆనందం కోసం ఫస్ట్ లుక్/టీజర్ సిద్ధం చేయాలని చిత్రబృందం ఎంత శ్రమించిందో నాకు తెలుసు. కానీ ఓ ప్రమోషనల్ వీడియో మీ ముందు ఉండాలంటే అన్ని సాంకేతిక విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కావడంలేదు. మీరెంత నిరాశకు గురవుతారో నేను అర్థం చేసుకోగలను" అంటూ సోషల్ మీడియాలో ఓ సందేశం పోస్టు చేశారు.

అయితే, ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపించే ప్రేమ, వారు చేపట్టే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తానని, కానీ ఈసారి అభిమానులు అందరూ ఇంటి వద్దే ఉంటూ అధికారుల సూచనలు పాటిస్తూ, భౌతికదూరం నిబంధనకు కట్టుబడి ఉండాలన్నదే తన విన్నపం అని తెలియజేశారు. ఇదే మీరు నాకు ఇచ్చే అతి విలువైన బహుమతి అంటూ సందేశం అందించారు.
Jr NTR
Fans
Teaser
Birthday
RRR
Tollywood

More Telugu News