AP High Court: విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సుమోటో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా

Vizag gas leak issue hearing adjourned in AP High Court
  • కొన్నిరోజుల క్రితం విశాఖలో గ్యాస్ లీక్
  • సుమోటోగా కేసు నమోదు చేసిన హైకోర్టు
  • కౌంటర్ దాఖలుకి సమయం కోరిన ప్రభుత్వం

ఇటీవల విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. వందలమంది విషవాయు ప్రభావానికి గురయ్యారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తాజాగా ఈ కేసుపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో, కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని ప్రభుత్వం న్యాయస్ధానాన్ని కోరింది.

  • Loading...

More Telugu News