TikTok: అత్యాచారానికి దారితీసిన టిక్‌టాక్ ప్రేమ!

TikTok love ends with rape in Hyderabad
  • నిందితుడికి పెళ్లయి, నలుగురు సంతానం
  • బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
  • నిందితుడి కోసం పోలీసుల గాలింపు
టిక్‌టాక్‌లో మొదలైన ప్రేమ చివరికి అత్యాచారానికి దారితీసింది. హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీకి చెందిన యువతి (27)కి గతేడాది డిసెంబరులో తలాబ్‌కట్ట నషేమన్‌నగర్‌వాసి అక్బర్ షా (34)తో టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అక్బర్ షాకు అప్పటికే పెళ్లయి, నలుగురు సంతానం కూడా ఉన్నారు. అయినప్పటికీ తనకు పరిచయమైన యువతిని ప్రేమ పేరిట నమ్మించాడు. తన మాయలో పడిన యువతిని టోలీచౌకిలోని తన సోదరి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించేందుకు బంధువుల సమక్షంలో ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆపై మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు పత్తా లేకుండా పోవడంతో బాధితురాలు నిన్న చాంద్రాయణుగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
TikTok
Hyderabad
Old city
Love
Crime News

More Telugu News