కరోనా అప్‌డేట్‌: ఏపీలో 2,230కి చేరిన కేసులు

coronavirus cases in ap
  • గత 24 గంటల్లో 9,880 శాంపిళ్ల పరీక్ష
  • మరో 25 మందికి కరోనా
  • ఆసుపత్రుల్లో 747 మందికి చికిత్స
  • 1,433 మంది డిశ్చార్జ్  
ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగింది.  గత 24 గంటల్లో 9,880 శాంపిళ్లను పరీక్షించగా మరో 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 103 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,230గా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 747 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో మరొకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు ఏపీలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 4, గుంటూరులో 4, కర్నూలులో 3, నెల్లూరులో 1, ప్రకాశంలో 3, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 3 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.
                     
జిల్లాల వారిగా కేసుల వివరాలు..
 
Go Back to Shorts
Corona Virus
Lockdown
Andhra Pradesh

More Telugu News