Gopi Sundar: విడాకులు పెండింగులో వున్నాయి .. నేను ప్రేమలో వున్నాను:  సంగీత దర్శకుడు గోపీసుందర్

Gopi Sundar
షార్ట్స్‌లో చూడండి
మలయాళంలో సంగీత దర్శకుడిగా గోపీసుందర్ కి మంచి క్రేజ్ వుంది. అక్కడ ఆయన ఇప్పుడు మిగతా సంగీత దర్శకులకు గట్టిపోటీ ఇస్తున్నాడు. ఈ మధ్య తెలుగులోను వరుస విజయాలను అందుకుంటూ, ఇక్కడ కూడా అవకాశాలను పెంచుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు అక్కడ  జోరుగా వినిపిస్తున్నాయి.

గోపీసుందర్ కి ప్రియ అనే భార్య .. ఇద్దరు పిల్లలు వున్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. దాంతో తన భార్య నుంచి విడాకులు కావాలని ఆయన కోర్టును ఆశ్రయించాడు. ఆయన నుంచి విడాకులు తీసుకోవడానికి భార్య కూడా అంగీకరించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే గోపీసుందర్ ఓ యువ గాయనితో ప్రేమలో పడ్డాడనీ, ఆమెను పెళ్లి చేసుకునే అవకాశాలు వున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా గోపీసుందర్ స్పందిస్తూ .. " విడాకుల కేసు కోర్టులో పెండింగులో వుంది .. ప్రస్తుతం నేను వేరొకరితో ప్రేమలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Gopi Sundar
Music Director
Priya

More Telugu News