Varla Ramaiah: ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉంది: వర్ల రామయ్య

Varla Ramaiah tweets on LG Polymers gas leak issue
  • సంచలనం రేపిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన
  • బాధితులపై కేసులు పెడుతున్నారని వర్ల రామయ్య ఆరోపణ
  • శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్
వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. ఈ ఘటనలో బాధితులపైనే కేసులు నమోదు చేస్తూ, ముద్దాయిలను గౌరవిస్తున్న తీరు అభ్యంతరకరం అని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ మొత్తం వ్యవహారాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.
Varla Ramaiah
LG Polymers
Vizag Gas Leak
Vizag
YSRCP

More Telugu News