Jabardasth: ‘జబర్దస్త్’ కమెడియన్ మహేశ్ పెళ్లి ఫొటోలు!

Jabardast commedian Mahesh marriage
  • తన సమీప బంధువు అయిన అమ్మాయితో మహేశ్ పెళ్లి
  • సామాజిక మాధ్యమాల్లో పెళ్లి ఫొటోలు
  • మహేశ్ దంపతులకు పలువురి అభినందనలు
టాలీవుడ్ హీరో నిఖిల్, డాక్టరు పల్లవిల వివాహం ఇవాళ ఉదయం జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజే ‘జబర్దస్త్’ నటుడు మహేశ్ వివాహం కూడా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. తన సమీప బంధువు అయిన అమ్మాయినే మహేశ్ వివాహం చేసుకున్నట్టు సమాచారం. కాగా, పలు తెలుగు చిత్రాల్లో మహేశ్ నటించాడు. ‘మహానటి‘, ‘రంగస్థలం’  సినిమాల్లో అతను పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. ఈ సందర్భంగా మహేశ్ దంపతులకు వారి బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.
Jabardasth
Mahesh
Marriage

More Telugu News