Sachin Tendulkar: సచిన్, కోహ్లీకి మధ్య ఉన్న తేడా ఇదే: వసీం అక్రమ్

Difference between Sachin and Kohli is this says Wasim Akram
  • సచిన్, కోహ్లీ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు
  • సచిన్ లో సహనం ఉంది
  • కోహ్లీ సహనాన్ని కోల్పోతాడు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ గొప్ప బ్యాట్స్ మెన్ అని.. అయితే ఇద్దరినీ పోల్చడం సరికాదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ అన్నారు. ఇద్దరి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయని చెప్పారు. సచిన్ ను స్లెడ్జింగ్ చేస్తే బ్యాట్ తో సమాధానం చెపుతాడని... అదే కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే సహనాన్ని కోల్పోతాడని తెలిపారు. అసహనంలో కోహ్లీ తన వికెట్ ను కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు.

ఇక సచిన్ పేరిట ఉన్న రికార్డులన్నింటినీ కోహ్లీ బ్రేక్ చేస్తాడా? అనే అనుమానం తనలో ఉందని చెప్పారు. సచిన్ చాలా రికార్డులకు కోహ్లీ ఇంకా దూరంలో ఉన్నడని అన్నారు. తన కెరీర్ ప్రారంభంలో తనలోని టాలెంట్ ను గుర్తించింది ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, ముదస్సర్ నజర్ లు అని చెప్పారు. వారి నుంచి తాను అనేక విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.
Sachin Tendulkar
Virat Kohli
Wasim Akram
India
Pakistan

More Telugu News