Nagababu: 50 రోజులుగా కర్ణాటకలో చిక్కుకున్న వీరిని తీసుకురండి: నాగబాబు అభ్యర్థన

naga babu on migrants
  • కర్ణాటక హసన్ జిల్లాలో 60 మంది చిక్కుకున్నారు
  • వారంతా శ్రీకాకుళం వాసులు
  • దుప్పట్లు, బొంతలు కుట్టుకుని అమ్ముకునే చిరు వ్యాపారులు  
కర్ణాటక హసన్ జిల్లాలో శ్రీకాకుళం వాసులు  60 మంది చిక్కుకుపోయారని జనసేన నేత, సినీనటుడు నాగబాబు చెప్పారు. దుప్పట్లు, బొంతలు కుట్టుకుని అమ్ముకునే ఆ చిరు వ్యాపారులు 50 రోజులుగా కర్ణాటకలోనే ఉండి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ఇంత వరకూ ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, ఆకలితో మల మల మాడి పోతున్నారని, వారం రోజులుగా తిండి లేదని తెలిపారు.

వారిది ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వచ్చే ఏర్పాటు చేయమని కోరుతున్నారని ఆయన ట్వీట్ చేశారు. వారికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస లింగాల వలస గ్రామం అని నాగబాబు వివరించారు. ప్రస్తుతం వారు హసన్ జిల్లాలోని చెన్నరాయపట్టణలో ఉన్నారని ఆయన వివరించారు. వారి ఫోను నంబర్లను కూడా నాగబాబు పోస్ట్ చేశారు.
Nagababu
Janasena
Lockdown

More Telugu News