Saidharam tej: అరుంధతి నక్షత్రం చూపుతున్న నిఖిల్‌ ఫొటో.. హీరో సాయి తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Saidharam tej Another wicket down in
  • మరో వికెట్‌ డౌన్‌ అయింది
  • జీవితంలో అతి పెద్ద అడుగు ముందుకు వేసినందుకు శుభాకాంక్షలు
  • మీ జీవితంలో హ్యాపీడేస్‌ నిండాలి
టాలీవుడ్‌ యువ హీరో నిఖిల్ ఓ ఇంటివాడయిన విషయం తెలిసిందే. డాక్టర్ పల్లవి వర్మ మెడలో తాళి కట్టిన ఆయన అనంతరం సంప్రదాయబద్ధంగా ఆమెకు అరుంధతి నక్షత్రం చూపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను హీరో సాయి తేజ్ పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'మరో వికెట్‌ డౌన్‌ అయింది.  జీవితంలో అతి పెద్ద అడుగు ముందుకు వేసినందుకు నిఖిల్‌కి శుభాకాంక్షలు. మీ జీవితంలో హ్యాపీడేస్‌ నిండాలని నేను కోరుకుంటున్నాను. ఇక నీ జీవితంలో ప్రతి రోజు మరింత ప్రత్యేకంగా, సరదాగా సాగిపోవాలని ఆశిస్తున్నాను' అని సాయితేజ్ పేర్కొన్నాడు. నిఖిల్‌కి పలువురు టాలీవుడ్ నటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సాయితేజ్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన సినీనటుడు బ్రహ్మాజీ.. 'ఎంజాయ్‌ చేస్తున్నావా తేజూ.. వికెట్‌ పడిపోతే..' అంటూ సరదాగా ప్రశ్నించాడు.
Saidharam tej
nikhil
marriage
Twitter

More Telugu News