ఫెడ్‌కప్ అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించిన సానియా మీర్జా
- ఆసియా-ఓసియానియా జోన్ నుంచి విజేతగా నిలిచిన సానియా
- ఆన్‌లైన్ పోలింగులో 60 శాతానికిపైగా ఓట్లు
- అవార్డును గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్న టెన్నిస్ స్టార్
విజేతగా నిలిచిన సానియాకు 2000 అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.1.50 లక్షలు) నగదు బహుమతి లభించింది. ఫెడ్ కప్ హార్ట్ అవార్డు గెలుచుకోవడంపై సానియా మాట్లాడుతూ.. ఈ అవార్డు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొంది. అవార్డు ద్వారా లభించిన నగదు మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వనున్నట్టు సానియా మీర్జా తెలిపింది.