Keerthi Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • అమెజాన్ ప్రైమ్ ద్వారా కీర్తి సురేశ్ సినిమా 
  • పవన్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం
  • తమిళం నేర్చుకుంటున్న అందాలభామ
Keerthi Suresh film releasing through Amezon Prime

*  అందాలతార కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్' తమిళ చిత్రం ముందుగా డిజిటల్ మీడియా ద్వారా విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రాన్ని లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో కాకుండా, అమెజాన్ ప్రైమ్ ద్వారా వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.
*  పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందే చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడు. ఈ విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ ప్రకటించాడు. 'సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం తమ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ వచ్చిందని, ఇదే రోజున మళ్లీ తమ కాంబినేషన్ లో చిత్రాన్ని ప్రకటించడానికి సంతోషంగా వుందని పేర్కొన్నాడు.  
*  ప్రస్తుతం ఇటు తెలుగు సినిమాలతో పాటు అటు తమిళంలో కూడా నటిస్తున్న కథానాయిక నిధి అగర్వాల్ ఇప్పుడు తమిళం నేర్చుకుంటోంది. ఈ విషయాన్ని తనే ఓ పోస్ట్ ద్వారా తెలిపింది. కొన్ని తమిళ పదాలకు అర్థాన్ని ఇంగ్లిష్ లో రాసుకున్న పేపెర్ ను సోషల్ మీడియాలో ఈ చిన్నది పోస్ట్ చేసింది. అంటే తమిళం నేర్చుకోవడం ద్వారా ఇకపై తమిళ సినిమాల మీద బాగా దృష్టి పెడుతుందని అనుకోవచ్చు.

More Telugu News