Botsa Satyanarayana: విశాఖలో లోకో పైలెట్లు విషవాయు ప్రభావానికి గురయ్యారన్నది అవాస్తవం: బొత్స
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, లోకో పైలెట్లు విషవాయు ప్రభావానికి గురయ్యారన్నది అవాస్తవం అని, సోషల్ మీడియాలో అసత్య కథనాల ప్రచారం సరికాదని హితవు పలికారు. వైజాగ్ గ్యాస్ లీక్ అంశంలో ప్రజలను హడలగొట్టే రీతిలో వార్తలు రాయొద్దని స్పష్టం చేశారు. గ్యాస్ లీక్ ఘటనను తమ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, ఘటనలో సంస్థ యాజమాన్యం వైఫల్యం ఉందని భావిస్తున్నామని అన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, అవసరమనుకుంటే పరిశ్రమను మరో ప్రాంతానికి తరలిస్తామని తెలిపారు.