మహేశ్ బాబుతో రాజమౌళి మూవీ బడ్జెట్ 300 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబుతో రాజమౌళి మూవీ బడ్జెట్ 300 కోట్లు?

Rajamouli Movie
  • మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా
  • ఈ నెల 31న రానున్న అధికారిక ప్రకటన
  • యాక్షన్ సన్నివేశాలపై భారీ బడ్జెట్  
మొదటి నుంచి కూడా రాజమౌళి కథాకథనాలపై పూర్తి దృష్టి పెడుతూ వచ్చాడు. అలాగే భారీ చిత్రాలకు తన పేరును కేరాఫ్ అడ్రెస్ గా మార్చుకున్నాడు. అలాంటి రాజమౌళి తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్'  రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, 450 కోట్లతో నిర్మితమవుతోంది.

ఆ తరువాత సినిమాను మహేశ్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేశాడు. ఈ సినిమా బడ్జెట్ గా 300 కోట్లను కేటాయించారనే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో మహేశ్ బాబును జేమ్స్ బాండ్ తరహా పాత్రలో రాజమౌళి చూపించనున్నాడని అంటున్నారు. యాక్షన్ సన్నివేశాలపై భారీస్థాయిలో ఖర్చు చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. కృష్ణ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 31వ తేదీన ఈ  ప్రాజెక్టును ప్రకటించి, ఆ తరువాత ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెడతారని అంటున్నారు.
Rajamouli
Mahesh Babu
Tollywood

More Telugu News