చేప ప్రసాదం పంపిణీ లేదు: బత్తిని సోదరుల కీలక ప్రకటన
- కరోనా కారణంగా మందు తయారు చేయడం లేదు
- ఈ సంవత్సరం ఎవరూ హైదరాబాద్ రావద్దు
- మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బత్తిని
చేప ప్రసాదం ఉందని చెప్పినా, ఎవరైనా ఆన్ లైన్ లో పంపుతామన్నా నమ్మవద్దని, అసలు తాము ఈ ఏడాది ప్రసాదాన్ని తయారు చేయడం లేదని స్పష్టం చేశారు. ఎవరూ చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దని వారు కోరారు. ఈ నెల 29తో తెలంగాణలో లాక్ డౌన్ ముగిసినా, తాము ప్రసాదాన్ని పంపిణీ చేయబోమని, ఎవరైనా తమ పేరిట పంపిణీ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.