నెల్లూరు బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
- బోడిగాడి తోటలో ఘటన
- ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు పరిశ్రమకు వ్యాపించిన వైనం
- విషవాయువులు వెలువడే అవకాశం ఉందంటూ భయాందోళన
నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంటల కారణంగా రసాయనాలు తగలబడుతుండడంతో విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాన్స్ ఫార్మర్ కు చెట్ల కొమ్మలు తగలడంతో మంటలు రేగినట్టు గుర్తించారు.