మదర్స్ డే సందర్భంగా తల్లితో పాటు అత్తగారి ఫొటో కూడా పోస్టు చేసిన అమల

Akkineni Amala share adorable pics on Mothers Day
  • ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం
  • ట్విట్టర్ లో అమల స్పందన
  • తన జీవితంలో ముఖ్యమైన స్త్రీమూర్తుల ఫొటోలు పంచుకున్న వైనం
ఇవాళ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మపై పోస్టులే దర్శనమిస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీ అక్కినేని అమల కూడా మదర్స్ డే సందర్భంగా ట్విట్టర్ లో స్పందించారు.

ఈ సందర్భంగా తన జీవితంలోని కొందరు స్త్రీమూర్తులను తల్లుల కంటే మిన్న అని పేర్కొంటూ విషెస్ తెలిపారు. అంతేకాకుండా వారి ఫొటోలను కూడా పోస్టు చేశారు. తన తల్లి ఫొటో మాత్రమే కాకుండా అత్తగారైన అక్కినేని అన్నపూర్ణ ఛాయాచిత్రాన్ని కూడా అమల పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానిస్తూ, "ఆ ఫొటోలో ఉన్నది మా అత్తగారు అన్నపూర్ణ. తల్లి కంటే ఎక్కువ. ఐ మిస్ యూ అత్తమ్మా" అంటూ పేర్కొన్నారు. అమల పోస్టు చేసిన ఫొటోల్లో ఆమె సోదరి, మేనకోడలు కూడా ఉన్నారు. తల్లి గురించి చెబుతూ "మై బ్యూటిఫుల్ మామ్" అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Akkineni Amala
Mothers Day
Mother
Mother-in-Law

More Telugu News