అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తానని చెబుతూ.. అత్యాచారాలు చేస్తున్న వృద్ధుడు!
- బంజారాహిల్స్ లో ఘోరాలు
- పేద అమ్మాయిలపై వల
- ఇంటికి పిలిపించుకుని అత్యాచారాలు
తాజాగా 23 ఏళ్ల ఓ యువతిని ఇంటికి పిలిపించుకుని, మత్తు మందు ఇచ్చి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాధితురాలు... పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసింది. ఈ కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో సలీమ్ పలువురు అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది.