Wine Shops: మద్యం షాపులను మరో 13 శాతం తగ్గించిన ఏపీ సర్కారు

AP Government reduced wine shops
  • ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాల తగ్గింపు
  • తాజా నిర్ణయంతో 33 శాతానికి చేరిన దుకాణాల తగ్గింపు
  • రాష్ట్రంలో 2,934కి తగ్గిన మద్యం దుకాణాలు
ఏపీలో మరో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మద్యం షాపుల సంఖ్యను కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తగ్గించిన 20 శాతంతో కలిపి మొత్తం 33 శాతం దుకాణాలు తగ్గించినట్టయింది. తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,934కి తగ్గింది. ఏపీ సర్కారు ఇప్పటికే 40 శాతం బార్లను తొలగించింది. తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్న 13 శాతం దుకాణాలను ఈ నెలాఖరు నాటికి తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Wine Shops
Andhra Pradesh
Government
Alcohal

More Telugu News