Jagan: నెల్లూరు, చిత్తూరు జిల్లాల కరోనా కేసులకు కోయంబేడు మార్కెట్ తో సంబంధం ఉంది: సీఎం జగన్

AP CM Jagan says link between Nellore and Chittoor corona cases to Koyambedu market
  • కోయంబేడు మార్కెట్ కారణంగా ఏపీలోనూ కేసులు వచ్చాయన్న సీఎం
  • రాష్ట్రంలోకి 700 మంది కూలీలు వచ్చారని వెల్లడి
  • సరిహద్దు ప్రాంతాల్లో స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం
చెన్నైలోని కోయంబేడు హోల్ సేల్ మార్కెట్ కారణంగా తమిళనాడులోనే కాదు ఏపీలోనూ పలు జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందినట్టు గుర్తించారు. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కారణంగానే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు.

 స్క్రీనింగ్ లేకుండానే రాష్ట్రంలోకి 700 మంది కూలీలు ప్రవేశించారని వెల్లడించారు. అందుకే సరిహద్దు ప్రాంతాల్లో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇక, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని అన్నారు. ఇప్పటిదాకా 1.65 లక్షల కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఈ విషయాలు తెలిపారు.
Jagan
Koyambedu Market
Corona Virus
Nellore District
Chittoor District
Chennai
Andhra Pradesh
Tamilnadu

More Telugu News