Reliance JIO: జియో కొత్త ప్లాన్.. వినియోగదారుల ముందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్!

JIO introduces work from home plan
షార్ట్స్‌లో చూడండి
తన వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి నుంచి పని చేస్తున్న వారి కోసం 'వర్క్ ఫ్రమ్ హోమ్' ప్లాన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ కు అదనంగా రూ. 2,399తో మరో ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2,121 ప్లాన్ లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కాలపరిమితి కూడా 336 రోజులే. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 2,399 ప్లాన్ తో రోజుకు 2 జీబీ డేటా వినియోగించుకోవచ్చు.

మరోవైపు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారి కోసం యాడ్ ఆన్ ప్యాక్స్ ను కూడా జియో ఆఫర్ చేస్తోంది. రూ. 151, రూ. 201, రూ. 251 ప్లాన్లతో డేటా లభిస్తుంది. వీటికి రోజువారి డేటా పరిమితి లేదు. డేటా అయిపోయినప్పుడు ఏ సమయంలోనైనా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.
Go Back to Shorts
Reliance JIO
Work from Home Plan

More Telugu News