Chiranjeevi: విశాఖ గ్యాస్‌ లీక్ దుర్ఘటనపై చిరంజీవి, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు

chiranjeevi and pawan about gas leak
షార్ట్స్‌లో చూడండి
విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. 'విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన  వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. లాక్‌డౌన్‌ అనంతరం తిరిగి పరిశ్రమలు ప్రారంభించే విషయంపై  సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను' అని ట్వీట్ చేశారు

విశాఖ దుర్ఘటన హృదయవిదారకమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు. 'కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి. విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు భయకంపితులు అవుతున్నారు' అని చెప్పారు.

'అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకొంటున్నాయి' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 
'రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల బాధ్యతగా ఉండాలి. కఠినంగా వ్యవహరించాలి. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ నాయకులకు సూచించాను' అని చెప్పారు.
Go Back to Shorts
Chiranjeevi
Pawan Kalyan
Tollywood
Janasena
gas leak

More Telugu News