Liquor: వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకట.. మద్యం హోం డెలివరీకి సిద్ధమైన రాష్ట్రాలు!

  • నేటి నుంచి పంజాబ్‌లో మద్యం హోం డెలివరీ
  • ఇంటికి రెండు లీటర్లు మాత్రమే
  • హోం డెలివరీ కోసం వెబ్‌సైట్‌ను తెచ్చిన పశ్చిమ బెంగాల్
Liquor Home delivery in punjab and west Bengal

లాక్‌డౌన్ సడలింపులతో మద్యం దుకాణాలను తెరిచిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నాయి. మద్యాన్ని నేరుగా ఇంటికే డెలివరీ చేయాలని పంజాబ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు నిర్ణయించాయి.

దుకాణాల వద్ద వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు నేటి నుంచి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు  పంజాబ్‌ రాష్ట్ర ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ శాఖ తెలిపింది. ఎంత సమయంలో మద్యాన్ని డెలివరీ చేస్తారనే విషయాన్ని  సంబంధిత శాఖ కమిషనర్లు నిర్ణయిస్తారని తెలిపింది. అలాగే, ఇంటికి రెండు లీటర్లకు మించి మద్యాన్ని డెలివరీ చేయబోమని తెలిపింది.

పశ్చిమ బెంగాల్ కూడా ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. 21 ఏళ్లు దాటిన వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నట్టు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ సైట్‌లో ఆర్డర్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయనున్నారు.

More Telugu News