Chandrababu: విశాఖ గ్యాస్ లీక్‌ ఘటన గురించి తెలుసుకుని షాక్‌ అయ్యాను: చంద్రబాబు నాయుడు

chandrababu Shocked to learn about the death of 3 people hundreds being affected
  • ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
  • వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు
  • ప్రజలను ఆదుకోవడానికి పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలి
  • అధికారుల సూచనలను పాటించాలి
విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 'విశాఖలోని ఓ ప్లాంట్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని షాక్ అయ్యాను. ఆపదలో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకోవడానికి తెలుగు దేశం పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలి. అధికారులు సూచిస్తోన్న జాగ్రత్తలను అక్కడ వారంతా పాటించాలని నేను కోరుతున్నాను' అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

కాగా, గ్యాస్‌ లీక్‌ అయిన ప్రాంతంలో వందలాది మందిని అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అక్కడి ప్రజలను రక్షించడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
Chandrababu
Telugudesam
Vizag

More Telugu News