ప్రజల ప్రయాణాలకు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- ప్రజా రవాణాను కొన్ని మార్గదర్శకాలతో ప్రారంభించొచ్చు
- చేతులు కడుక్కోవడం, భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి
- కరోనాపై భారత్ విజయం సాధిస్తుంది
భారత బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గడ్కరీ ప్రసంగించారు. రవాణా, జాతీయ రహదారుల పునరుద్ధరణ ప్రజలకు భరోసాను కల్పిస్తుందని చెప్పారు. అయితే, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. చేతులు కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటివి తప్పనిసరి అని చెప్పారు. కరోనాపై, ఆర్థికమాంద్యంపై భారత్ విజయం సాధిస్తుందని చెప్పారు.