కరోనా అప్ డేట్స్: దేశంలో 46,433కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

COVID19 positive cases in India rises to 46433
  • దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,568 
  • కోలుకున్న 12,727 మంది
  • ఆసుపత్రుల్లో 32,134 మందికి చికిత్స  
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఏ రోజూ లేనన్ని మృతులు, కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో భారత్‌లో 195 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,568కి చేరింది.

గత 24 గంటల్లో దేశంలో 3,900 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 46,433కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 12,727 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో  32,134 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
COVID-19
Corona Virus
India

More Telugu News