Corona Virus: ఏపీలో మరో 67 మందికి కరోనా.. పలు జిల్లాల్లో భారీగా పెరిగిపోతోన్న కేసులు

coronavirus cases in ap
  • 24 గంటల్లో 10,292 శాంపిళ్ల పరీక్ష
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650
  • 524 మంది డిశ్చార్జ్  
  • కర్నూలులో మొత్తం కేసులు 491
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 శాంపిళ్లను పరీక్షించగా 67 మందికి కొవిడ్-19 పాజిటివ్  నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.

జిల్లాల వారీగా వివరాలు...            
                                 
                     
గ్రాఫ్ రూపంలో..
                    

More Telugu News

Corona Virus
COVID-19
Andhra Pradesh