Rishi Kapoor: రిషి కపూర్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లొద్దు: ముంబై పోలీసులు

  • భౌతికకాయాన్ని నేరుగా శ్మశానానికే తీసుకెళ్లాలి
  • పెద్ద సంఖ్యలో జనాలు హాజరుకాకూడదన్న పోలీసులు
  • చందన్ వాడి శ్మశానవాటికలో ఈ సాయంత్రం అంత్యక్రియలు
Take Rishi Kapoor dead body directly to graveyard says police

బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ ఈ ఉదయం 8.45 గంటలకు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ముంబై మహానగరాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, రిషి అంతిమ సంస్కారాలకు సంబంధించి ముంబై పోలీసులు పలు సూచనలు చేశారు.

ఆసుపత్రి నుంచి రిషి భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లరాదని... నేరుగా శ్మశానానికి తీసుకెళ్లాలని సూచించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరుకాకూడదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే అంత్యక్రియలకు హాజరవుతారని తెలుస్తోంది. చందన్ వాడి శ్మశానవాటికలో ఈ సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

More Telugu News