Lockdown: లాక్ డౌన్ దీర్ఘకాలం కొనసాగితే దేశంలో ఆకలి చావులు ఎక్కువవుతాయి!: ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

Lengthy lockdown will kill more people than Covid NR Narayana Murthy
  • లాక్‌డౌన్‌ దీర్ఘకాలం కొనసాగిస్తే ప్రమాదం
  • దేశంలో 190 మిలియన్ల మంది సంఘటిత రంగంలో పని చేస్తున్నారు
  • వారంతా జీవనోపాధి కోల్పోతారు
  • దేశంలో కరోనా మరణాల రేటు తక్కువ
దేశంలో కరోనా భయంతో విధించిన లాక్‌డౌన్‌ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్‌-19 మరణాల కంటే ఆకలి బాధ కారణంగా సంభవించే మరణాలే అధికంగా ఉంటాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి అన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకుంటూనే, పలు సంస్థలను తిరిగి తెరవాలని ఆయన సూచించారు.

భారత్‌లో ఏడాదికి దాదాపు 9 మిలియన్ల మంది పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో వాతావరణ కాలుష్యం కారణంగా మృతి చెందేవారు 1/4 శాతం మంది అని ఆయన చెప్పారు. 'దేశంలో ఏడాదికి 90 లక్షల మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో గత రెండు నెలల్లో సుమారు 1,000 మంది మాత్రమే  చనిపోయారు. ఇదేం పెద్దగా భయపడాల్సిన విషయమేం కాదు' అని ఓ ఇటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

దేశంలో 190 మిలియన్ల మంది భారతీయులు అసంఘటిత, స్వయం ఉపాధి రంగాల్లో పని చేస్తున్నారని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఇంత మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం చాలా మంది జీవనోపాధిని కోల్పోతారని తెలిపారు.

కాగా, దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. ఇప్పటికే చాలా మంది అతితక్కువ ధరకు పలు రకాల పరికరాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. భారత్‌లో మరణాల రేటు ఇతర దేశాలతో పోల్చుకుంటే తక్కువగా ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా కేసుల మరణాల రేటు చాలా తక్కువగా (0.25-0.5 మధ్య) ఉంది. లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో భారత్‌లో చాలా వరకు కరోనా కేసుల సంఖ్యను తగ్గించగలిగాం అని అన్నారు.
Lockdown
NR Narayana Murthy
Corona Virus
India

More Telugu News