Allu Arjun: 'పుష్ప'లో ఆశ్చర్యచకితులను చేసే బన్నీ లారీ ఛేజింగ్ సీన్!

Sukumar Movie
  • అడవి నేపథ్యంలో సాగే కథాకథనాలు
  • హైలైట్ కానున్న భారీ యాక్షన్ సీన్స్
  • గ్యాప్ ఇచ్చేది లేదంటున్న సుకుమార్
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందించనున్నాడు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా రష్మిక కనిపించనుంది. అడవి నేపథ్యంలో .. అక్రమ కలప రవాణా ప్రధాన కథాంశంగా ఈ సినిమా నిర్మితం కానుంది.

ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ఒక రేంజ్ లో వుంటాయని అంటున్నారు. ముఖ్యంగా బన్నీ లారీని ఫారెస్టు అధికారులు ఛేజ్ చేసే సీన్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. ముందుగా యాక్షన్ సీన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ల చేతిలో పెట్టాలని చూశారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో, పీటర్ హెయిన్స్ ను గానీ .. కణల్ కణ్ణన్ ను గాని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆలస్యం కావడంతో, సెట్స్ పైకి వెళ్లిన తరువాత మాత్రం గ్యాప్ ఇవ్వకూడదనే నిర్ణయంతో సుకుమార్ వున్నాడని అంటున్నారు.
Allu Arjun
Rashmika Mandanna
Sukumar

More Telugu News