ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్త తెలుసుకుని చాలా బాధపడ్డాను: మహేశ్ బాబు

A brilliant actor gone too soon mahesh babu
  • ఓ గొప్ప నటుడిని ఇంత త్వరగా కోల్పోవడం బాధాకరం
  • ఆయనను నిజంగా చాలా మిస్‌ అవుతున్నాం
  • ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను
తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. టాలీవుడ్ హీరో మహేశ్ బాబు నటించిన 'సైనికుడు' సినిమాలో ఆయన నటించారు. ఆయన తెలుగులో నేరుగా నటించిన ఏకైక సినిమా ఇదే. ఆయన మృతి పట్ల మహేశ్ బాబు సంతాపం వ్యక్తం చేశారు.

'ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందాడన్న వార్త తెలుసుకుని నేను చాలా బాధపడ్డాను. ఓ గొప్ప నటుడిని ఇంత త్వరగా కోల్పోవడం బాధాకరం. ఆయనను నిజంగా చాలా మిస్‌ అవుతున్నాం.. ఆయన కుటుంబానికి, ఆయనను ప్రేమించే వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను'  అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

ఇర్ఫాన్ ఖాన్ మృతిపై సినీనటుడు నాగబాబు స్పందిస్తూ... తీవ్ర దిగ్భ్రాంతి చెందానని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన నటన చాలా మందికి ఎప్పటికీ స్ఫూర్తిమంతమని తెలిపారు.

'నేను మిమ్మల్ని ఎన్నడూ కలవలేదు సర్. కానీ, మీ మృతి పట్ల చాలా బాధపడుతున్నాను. మీకు కళల పట్ల ఉన్న ప్రేమే మిమ్మల్ని అందరికీ దగ్గరచేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అంటూ హీరోయిన్ సాయి పల్లవి ట్వీట్ చేసింది.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
irfan khan

More Telugu News