నెల్లూరులో కరోనా రోగులకు సేవలందించేందుకు రంగంలోకి దిగిన రోబోలు
- రోగుల నుంచి డాక్టర్లు, సిబ్బందికి సోకుతున్న వైరస్
- రోబోలను రంగంలోకి దించిన ప్రభుత్వం
- ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబోలు
తొలుత ఈ రోబోలను నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఓ రోబో సేవలను అందిస్తోంది. తాజాగా దీనికి మరో రెండు రోబోలు జతచేరనున్నాయి. 40 కేజీల ఆహారం, మందులను ఒకేసారి సరఫరా చేయగలిగిన శక్తి ఈ రోబోల సొంతం కావడం గమనార్హం.
మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,332కి పెరిగింది. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.