Bengaluru: విషాదం.. ఆసుపత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కరోనా పేషెంట్

Corona Patient Allegedly Jumps To Death From Bengaluru Hospital
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఐదో అంతస్తు నుంచి దూకి  ఓ కరోనా పేషెంట్ (50) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకిందనే భయంతోనే ఆయన ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో ఈ ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఆసుపత్రిలోని ట్రామా వార్డు నుంచి మృతుడు దూకాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తొలి అంతస్తు రూఫ్ టాప్ పై మృతదేహం లభ్యమైందని చెప్పారు.

వైద్యులు వెల్లడించిన సమాచారం ప్రకారం... తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో శుక్రవారం నాడు ఆసుపత్రిలో ఆయన చేరారని తెలిపారు. కిడ్నీ సంబంధిత ఇబ్బందులు కూడా ఆయనకు ఉన్నాయని... పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటవ్ నిర్ధారణ అయిందని చెప్పారు. మరోవైపు, కర్ణాటకలో ఇప్పటి వరకు 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.
Go Back to Shorts
Bengaluru
Corona Virus
Suicide

More Telugu News