జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం

26-04-2020 Sun 19:28
  • సువెన్ ఫార్మా బిల్డింగ్ లో చెలరేగిన అగ్నికీలలు
  • సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శకటాలు
  • మంటలను ఆర్పుతున్న సిబ్బంది
Fire accident broke in pharma building in Jeedimetla

హైదరాబాదులోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఈ సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రముఖ ఫార్మా కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న సువెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ సంస్థ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే స్పందించింది. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది.