Bhuma Akhila Priya: ‘కరోనా’ మృతులను హైవే పక్కనే పూడ్చి పెడుతున్నారు: భూమా అఖిల ప్రియ

Bhuma Akhila Priya statement
  • నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరగడం లేదు
  • అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదు
  • ఆ ప్రాంతాల నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉంది
‘కరోనా’తో కర్నూలు వణికిపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ బారిన పడి మృతి చెందిన వారికి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు జరగడం లేదని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కర్నూలు హైవే పక్కన పూడ్చి పెడుతున్నారని ఆరోపించారు. ఆయా మృతదేహాలను పూడ్చిన చోటే మాస్కులు, వస్తువులు వదిలి వేస్తున్నారని అన్నారు. ఆ ప్రాంతాల నుంచి వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Bhuma Akhila Priya
Telugudesam
Corona Virus

More Telugu News