Wuhan: చివరి కరోనా పేషెంట్ ను డిశ్చార్జి చేసిన వుహాన్ ఆసుపత్రి

  • కరోనా వైరస్ జన్మస్థానంగా నిలిచిన వుహాన్ సిటీ
  • 50,333 కేసులు నమోదు, 3,869 మంది మృతి
  • వుహాన్ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లెవరూ లేరని అధికారులు వెల్లడి
Wuhan discharges its last corona patient

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మస్థానంగా ఎంతో అప్రదిష్ఠ మూటగట్టుకున్న వుహాన్ నగరం క్రమంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. ఇటీవలే అక్కడ లాక్ డౌన్ ను కూడా సడలించారు. ఈ నేపథ్యంలో, చిట్టచివరి కరోనా పేషెంట్ ను ఇక్కడి మెడికల్ సెంటర్ నుంచి డిశ్చార్జి చేశారు. హుబెయ్ ప్రావిన్స్ కు చెందిన వ్యక్తి విషమపరిస్థితిలో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్టు వుహాన్ వైద్య వర్గాలు తెలిపాయి. దాంతో వుహాన్ లో కరోనా కేసుల సంఖ్య సున్నా అయింది.

దీనిపై చైనా జాతీయ హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ మాట్లాడుతూ, "ఏప్రిల్ 26 నాటికి వుహాన్ లో కరోనా పేషెంట్లెవరూ లేరు. ఈ సందర్భంగా వుహాన్ వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చివరి పేషెంట్ ఎంతో విపత్కర పరిస్థితులను అధిగమించి కోలుకున్నారు" అని వివరించారు. కరోనా పుట్టుకకు కేంద్రస్థానంగా నిలిచిన వుహాన్ నగరంలో 50,333 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,869 మంది మరణించారు. 

More Telugu News