రేషన్ కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
- బియ్యంతో పాటు కందిపప్పు ఉచితం
- సబ్సిడీపై గోధుమలు, పంచదార కూడా
- మేలో ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు
అందుకుగాను మొత్తం 6,83,06,702 కిలోల బియ్యాన్ని, 16 లక్షల 930 కిలోల కంది పప్పును, 32.18 లక్షల కిలోల గోధుమల కోటాను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిలో గోధుమలు, పంచదార రిలీజింగ్ ఆర్డర్ ను మీ సేవా ఆన్ లైన్ ద్వారా పొందవచ్చని, చెల్లింపులు కూడా అక్కడి నుంచే జరపాలని పౌర సరఫరాల శాఖ నుంచి డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర గోడౌన్లలో బియ్యంతో పాటు కందిపప్పు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, లాక్ డౌన్ కారణంగా పనిలేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.