Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Trisha to roamce with Raviteja again
  • రవితేజతో మరోసారి త్రిష జోడీ 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన శ్రద్ధా కపూర్
  • నాగశౌర్య తాజా ప్రాజక్ట్
 *  గతంలో 'కృష్ణ' సినిమాలో జోడీ కట్టిన రవితేజ, త్రిష జంట ఇప్పుడు మరో సారి జత కట్టే అవకాశం కనిపిస్తోంది. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగును ప్రారంభించుకునే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు త్రిషను ఎంపిక చేసినట్టు సమాచారం.
*  మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మహేశ్ సరసన చేయడానికి ఆమె కూడా ఆసక్తి చూపుతోందని, ప్రస్తుతం డేట్స్ సర్దుబాటు చేసే ప్రయత్నంలో వుందని అంటున్నారు.
*  యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేం సాగర్ చంద్ర దర్శకత్వంలో చేయనున్నాడు. సాగర్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
Trisha
Raviteja
Mahesh Babu
Parashuram
Naga Shourya

More Telugu News