Andhra Pradesh: విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ఏపీ ప్రభుత్వం!

School Holidays Extend in Andhrapradesh
  • మే 3 వరకూ సెలవుల పొడిగింపు
  • ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం
  • సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ
లాక్ ‌డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ చిన వీరభద్రుడు ఓ సర్క్యులర్ ను‌ జారీ చేశారు. వాస్తవానికి 2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, పరీక్షలు జరపకుండానే సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై లాక్ డౌన్ మరోమారు పొడిగించబడింది.

ఈ నేపథ్యంలోనే సెలవులను కూడా పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మే 3 తరువాత పరిస్థితిని సమీక్షించి, సెలవులను పొడిగించాలా? లేక పరీక్షలు నిర్వహించాలా? అన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. ఏపీలో ఇంటర్, టెన్త్ విద్యార్థుల పరీక్షలు ఇంకా జరగలేదన్న సంగతి తెలిసిందే. మిగతా తరగతుల వారికి మాత్రం హాజరు ఆధారంగా పై తరగతులకు ప్రమోషన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
Andhra Pradesh
Schools
Holidays
Extened

More Telugu News