COVID-19: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం... గ్రామ, వార్డు వలంటీర్లకు రూ. 50 లక్షల బీమా!

Fifty Lakhs Insurance for Volunteers in AP
  • కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లు
  • పాజిటివ్ రోగులతో కాంటాక్ట్ అయ్యే అవకాశం
  • సీఎం ఆదేశాల మేరకు బీమా
కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ముందు వరుసలో నిలబడి గ్రామాల్లో, పట్టణాల్లో సేవలందిస్తున్న వలంటీర్లకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందికి పైగా వలంటీర్లు ఉండగా, వీరందరికీ, పీఎంజీకే (ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్) ప్యాకేజీ కింద బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లదే ప్రధాన పాత్రన్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వ్యక్తులతో వలంటీర్లు నేరుగా కాంటాక్ట్ అవుతుండడంతో, వైరస్ సోకే ప్రమాదం ఉన్నందునే, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తమకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడంపై వలంటీర్లు హర్షం వ్యక్తం చేశారు.
COVID-19
Insurence
Volenteers
Ward Volenteers
Andhra Pradesh
Jagan

More Telugu News