Mamata Banerjee: కేంద్ర బృందాల పర్యటనను 'సాహసోపేత యాత్రలు'గా అభివర్ణించిన టీఎంసీ... మమత సహకరించడం లేదన్న కేంద్రం

  • రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల అంచనాకు కేంద్ర బృందాల రాక
  • సీఎంకు ఆలస్యంగా సమాచారం అందించారంటూ టీఎంసీ ఎంపీల రుసరుస
  • బెంగాల్ ప్రభుత్వం సహకరించడంలేదని కేంద్ర బృందం ఆరోపణ
War of words between Centre and West Bengal

రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు పర్యటనకు రానుండడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 'సాహసోపేత యాత్రలు'గా అభివర్ణించింది. పశ్చిమబెంగాల్ లో కేంద్ర బృందాలు అడుగుపెట్టిన మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం సమాచారం అందించడాన్ని టీఎంసీ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కేంద్రం ధోరణి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, సుదీప్ బంధోపాధ్యాయ్ విమర్శించారు.

కాగా, కేంద్ర బృందాల్లో ఓ బృందానికి నాయకత్వం వహిస్తున్న అపూర్వ చంద్ర పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన తమకు స్థానిక ప్రభుత్వం విస్తృత సహకారం అందించడంలేదని ఆరోపించారు. తమ బృందంలోని సభ్యులను బయటికి అనుమతించేది లేదన్న సమాధానం స్థానిక అధికారుల నుంచి వినవచ్చిందని తెలిపారు.

More Telugu News