Uma Madhusudhan: యూఎస్ లో మైసూర్ డాక్టర్ కు అరుదైన గౌరవం... ఇంటి ముందు పోలీసు, ఫైర్ ఇంజన్ల పెరేడ్... వీడియో ఇదిగో!

Indian Origin US Doctor Gets Vehicle Selute
  • యూఎస్ లో స్థిరపడిన మైసూర్ కు చెందిన ఉమా మధుసూదన్
  • సౌత్ విండ్సార్ హాస్పిటల్ లో కరోనా బాధితులకు చికిత్స
  • వీధిలో నుంచి వెళుతూ హారన్ కొడుతూ వంద వాహనాల పరేడ్
అమెరికాలో కరోనా వైరస్ బారినపడిన వారికి స్వస్థత చేకూర్చేందుకు ఎంతో సేవ చేస్తున్న భారత సంతతి మహిళ డాక్టర్  ఉమా మధుసూదన్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. మైసూర్ ప్రాంతానికి చెందిన ఆమె అమెరికాలోని సౌత్ విండ్సార్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోని వైద్య బృందం ఎంతో మంది కరోనా పాజిటివ్ లను నెగటివ్ లుగా మార్చింది.

దీంతో అక్కడి పోలీసులు, అధికారులు ఆమె సేవలను కొనియాడుతూ ఆమె ఇంటి ముందు వాహనాల పరేడ్ ను నిర్వహించారు. ఆమె నివాసం ఉన్న వీధిలోకి దాదాపు 100 వాహనాలను తీసుకుని వచ్చి నిలిపారు. వీటిల్లో పోలీసు, అగ్నిమాపక, ఇతర అధికారుల వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి.

 వీటిని ఆమె ఇంటి ముందు కొన్ని సెకన్ల పాటు నిలిపి హారన్ కొట్టి ఆమె చేస్తున్న సేవలను అభినందించారు. 'మీ సేవకు సలామ్' అని రాసున్న ఓ పోస్టర్ ను లెటర్ బాక్స్ కు తగిలించి వెళ్లారు. ఇక ఆ వాహనాలను చూసిన ఉమా మధుసూదన్ సైతం పట్టలేని ఆనందంతో వారికి చేతులు ఊపుతూ ఇంటి ముందే నిలబడి పోయారు. సుమారు ఆరున్నర నిమిషాల నిడివివున్న ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు. 
Uma Madhusudhan
USA
Doctor
Parede
Police

More Telugu News